వైసీపీ అధినేత,సిఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కిలారు రోశయ్య పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
టీడీపీ, చంద్రబాబు మేనిపెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలుపరచి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించలేదన్నారు. 2014 నుంచి 2019 కాదు , చంద్రబాబు 14 ఏండ్ల సీఎంగా ఎప్పుడూ మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు.
వైసీపీ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ పార్లమెంట్‌కు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. ఈ రోజు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారని తెలిపారు. మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని సీఎం జగన్ చెప్పారన్నారు.
ఈనెల 26,27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంపై తుది కసరత్తు జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రతో ప్రచారాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదటిరోజు ప్రచారాన్ని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండే నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దింతో నేడు మొదటి రోజు వేంపల్లి, వీరపునాయినిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు…