ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఆరు నెలలు కావస్తోంది. కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చాక... నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన, తమను ఇబ్బందులు పెట్టిన నాయకులు, ఇతరుల టార్గెట్‌గా పావులు కదులుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలోఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారితోపాటు పార్టీని భుజానికెత్తుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై ఇష్టా రీతిన మాట్లాడిన నేతలు అందరి మీద వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా…