శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే రాజయ్య పేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు. మత్స్యకారులకు సంఘీభావంగా మేం నిలబడతాం.. యావత్ పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా?.. ఎందుకీ నిర్బంధం అని ఆయన ప్రశ్నించారు.