రాష్ట్రంలో అధికార పార్టీకి, మా చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత లేదన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్ర రహదారులు , జాతీయ రహదారుల మీద ప్రజల్లో చర్చకు వైసీపీ ప్రభుత్వం వస్తుందా? రాష్ట్రంలో దాదాపు 90 వేల కోట్లు పైబడి నిధులతో జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. నేడు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రహదారులకు చేయవలసిన చిన్న…
కాకినాడలో ఎస్సై గోపాలకృష్ణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అధికారు వేధింపులు, అవమానాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఎస్సై ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకే అవమానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనం…
ఆయన కేంద్ర మాజీ మంత్రి. అనువంశికంగా వచ్చిన హక్కులను పోరాడి సాధించుకున్నారు. హోదాతోపాటు ఇటీవల ఓ కారు కాంపౌండ్‌లోకి వచ్చింది. ఆ.. వాహనం ఎక్కాలంటేనే పెద్దాయన తెగ టెన్షన్ పడుతున్నారట. కోరి తెచ్చుకున్న ఆ కారు కష్టాలేంటో ఓ లుక్కేయండి. అశోక్ గజపతిరాజు. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా.. ప్రతి పక్షంలో వున్నప్పుడు సైలెంట్‌గా వ్యవహరించడం ఆయనకు అలవాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కాంట్రవర్సీకి ఆస్కారం వచ్చిన సందర్భాలు అరుదే. ఇదంతా 2020కి ముందుమాట కాగా ఇప్పుడు అశోక్…