ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ముఖ్య శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారా? ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీ లీడర్లకు చేరవేస్తున్నారా? ఇప్పుడు ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు మంత్రులు.. సచివాయలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారనే అంశంపై చర్చించారు..