ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగు దేశం కూడా భారతీయ జనతా పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణం అన్నారు.. ఇప్పటికీ బిల్లులు మ్యానువల్ గా జరగడం వెనుక ఉద్దేశ్యాలను ప్రశ్నిస్తున్నాం.. ఆర్ & ఆర్ నిర్ధారణ, నిర్వాసితుల గుర్తింపు లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు.. కేంద్రం నిధులు ఇస్తే పూర్తి చేస్తామని…
ఇవాళ జరిగిన భారత్ బంద్‌పై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… రైతుల కోసం జరిగిన బంద్‌లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక, వైసీపీ, టీడీపీ.. పార్లమెంట్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు…