CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యంగా కొండపై వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం, భోగాపురం ఎయిర్‌పోర్టు,…