వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి అందరికి తెల్సిందే. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇప్పుడిప్పుడే ప్రజల్లో గుర్తింపు దక్కుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన ఆరునెలల్లో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య, యువత ఆత్మహత్యలు, రైతు సమస్యలపై గళం విప్పుతున్నారు. యువత నుంచి…