ఆంధ్రప్రదేశ్‌లో మరో సంక్షేమ కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ వైఎస్సార్ సంచార పశు…