వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ములను జమ చేసేందుకు సిద్ధం అయ్యింది ఏపీ ప్రభుత్వం.. రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ము డిపాజిట్ చేస్తారు
వైయస్సార్ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన నేతన్నలకు ఆర్థిక సహాయం కార్యక్రమం ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దాదాపుగా 80 వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది: రూ.192 కోట్లు జమచేస్తున్నాం. నేతన్నలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు నా పాదయాత్రలో స్వయంగా చూశాను. ప్రతి జిల్లాలో చేనేతల సమస్యలు నాకు చెప్పకున్నారు అని సీఎం అన్నారు. వారి గోడును బహుశా నేనెప్పటికీ మరిచిపోలేను. మగ్గంమీద బతుకుతున్న చేనేత కుటుంబానికి అక్షరాల రూ.24వేల…
కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాల అమలు విషయం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్… ఇప్పటికే పలు పథకాలకు సంబంధించిన సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం.. రేపు వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేయడానికి పూనుకుంది.. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక్కొక్కరి అకౌంట్లో రూ.24 వేల చొప్పున వేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రవ్యాప్తంగా 80,032 మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.192.08 కోట్లు వేయనున్నారు సీఎం…