YSR Nethanna Nestham: వరుసగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ములను జమ చేసేందుకు సిద్ధం అయ్యారు.. రేపు అనగా ఈ నెల 21వ తేదీ శుక్రవారం రోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్న ఆయన.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.. అనంతరం వైఎస్సార్ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ము డిపాజిట్ చేస్తారు.
Read Also: CM YS Jagan: ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై సీఎం జగన్ సమీక్ష.. కార్యాచరణకు ఆదేశాలు
అనంతరం వెంకటగిరి త్రిభువన్ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం వైఎస్ జగన్.. రేపు వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు జమ కానుండగా.. ఏటా వైఎస్సార్ నేతన్న నేస్తం కింద సాయాన్ని అందిస్తూ వస్తోంది వైఎస్ జగన్ సర్కార్.. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేత కార్మికులకు లబ్ధి పొందనున్నారు.. రూ.193.64 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చేనేతల కోసం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చింది జగన్ సర్కార్. అర్హత కలిగి సొంత మగ్గం ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ .1.2 లక్షలు సాయం అందుతోంది. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేతగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కచ్చితంగా చేనేత సంఘంలో నమోదు చేసుకోని ఉండాలనే నిబంధన ఉన్న విషయం విదితమే.