టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. గాయం అయ్యింది.. రెస్ట్‌లో ఉన్నాను అంటూ కేటీర్ ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశాం అన్నారు.. దానికి చిన్న దొర గారికి కోపం వచ్చిందని.. మాపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని మండిపడ్డారు.. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి.. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని…