పల్నాడు జిల్లా వినుకొండలో రెండ్రోజుల క్రితం ప్రత్యర్థి దాడిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని రషీద్ నివాసానికి వెళ్లిన జగన్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.