వైఎస్ జగన్ హెలికాప్టర్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనలో.. జగన్ హెలికాప్టర్ దెబ్బ తినడం.. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గం వెళ్లడం పై వివాదం రాజుకుంది. జగన్ పర్యటనలో భద్రతా లోపం ఉందంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్నారు. అసలు హెలికాప్టర్ విషయంలో ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు.