వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కూతరు సునీతరెడ్డి.. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది సీబీఐ.. ఇక, సునీత రెడ్డి, సీబీఐ పిటిషనల్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు తదుపరి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కొనసాగిస్తోంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని.. సిల్లీ విషయాలను సీరియస్‌గా తీసుకుంటోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు.
మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఆదివారం సీబీఐ విచారించనుంది.
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచింది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మారింది వైఎస్ వివేకా హత్య కేసుతో.. ఆ తర్వాత హైదరాబాద్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ఓవైపు.. దర్యాప్తులో ఇంకో వైపు.. ఇలా దూకుడు చూపిస్తోంది సీబీఐ.. ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్…
CBI Summons YS Bhaskar Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వైఎస్ వివేకా హత్య కేసు బదిలీ అయిన తర్వాత.. దూకుడు పెంచిన సీబీఐ.. వరుసగా నిందితులను నోటీసులు జారీ చేస్తూ.. విచారణ జరుపుతోంది.. ఇక, ఈ కేసులో తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు పంపింది సీబీఐ.. రేపు అనగా.. శనివారం…