Andhra Pradesh: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ పద్దతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సేవ్ దేశీ కౌస్ ప్రచారంలో భాగంగా ఆమె సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. అంతేకాకుండా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం…
ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవోటెల్ హోటల్‌లో తన భార్య భారతితో కలిసి జగన్ సీజేఐను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు కడప జిల్లా వెళ్లిన జగన్ ఈరోజు మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ…
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పా రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిశారు. శిల్పా రెడ్డి నటుడు సమీర్ రెడ్డికి సోదరి, అలాగే సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఇటీవలే వారిద్దరూ కలిసి ఆధ్యాత్మిక ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పా సీఎం జగన్ ను విజయవాడలో కలిసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. Read…