ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దూ అదుపూ ఉండేది కాదన్నది రాజకీయవర్గాల్లో విస్తృతాభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయేవారు. అబ్బే.... వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్ళు విసిరేవారాయన. కట్ చేస్తే.... రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే.
Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఆయన చేయించుకున్న సర్వేలో కూడా అదే తేలిందని.. చంద్రబాబు 175 సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ధైర్యం ఉంటే చెప్పాలి అని సవాల్ చేశారు. ఇక, కుప్పం, మంగళగిరిలో అబ్బాకొడుకులు ఇద్దరూ ఓడిపోతారని చెప్పుకొచ్చారు జోగి రమేష్..…