VC Sajjanar : హైదరాబాద్ నగర వీధులు రాత్రివేళల్లో వేడుకల వేదికలుగా మారిపోతున్న దృశ్యాలు ఇటీవల తరచూ కనపడుతున్నాయి. ముఖ్యంగా యువత బర్త్‌డే వేడుకలను బహిరంగంగా, పబ్లిక్ రోడ్లపై నిర్వహించడం కొత్త నాయా ట్రెండ్‌గా మారింది. మితిమీరిన సందడి, మద్యం మత్తులో అప్రమత్తత లేకుండా చేసే చేష్టలతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అర్ధరాత్రి వేళ రోడ్లపై శబ్దాలతో, పాటలతో, హంగామాతో సాగుతున్న ఈ పండుగలు శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఉప్పల్‌లోని భగాయత్ రోడ్…