చాలా మంది ప్రస్తుతం అనేక కారణాలతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాలు, వర్క్ టెన్షన్, ఇంకేదైనా సిట్చ్యువేషన్.. ఇవన్నీ కూడా చక్కని నిద్రని దూరం చేస్తున్నాయి. అనేక ఆలోచనల కారణంగా నేటి జనరేషన్ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మీరు రాత్రిపూట నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారా? రోజు ఒత్తిడి మిమ్మల్ని మెలకువగా ఉంచుతుందా? అవును అయితే, యోగా మీకు దివ్యౌషధం కావచ్చు. పడుకునే ముందు కొన్ని ప్రత్యేక యోగాసనాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది , నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. యోగా శరీరాన్ని , మనస్సును సమతుల్యం చేస్తుంది. నెమ్మదిగా చేసే యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, శరీరానికి విశ్రాంతినిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బాలసనం (పిల్లల భంగిమ) :…