2025 ఒక సాధారణ రాజకీయ సంవత్సరం కాదు..ఇది ఒక్క నాయకుడు ప్రపంచాన్ని ఎంతగా కుదిపేయగలడో చూపించిన సంవత్సరం. ఓటు బూత్ నుంచి వైట్ హౌస్ వరకు వచ్చిన ఆ వ్యక్తి నిర్ణయాలు దేశాల మధ్య నమ్మకాన్ని బద్దలుకొట్టాయి. స్నేహాన్ని అనుమానంగా మార్చాయి. వాణిజ్యాన్ని యుద్ధంగా మార్చాయి. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక కొత్త యుద్ధాలు మొదలయ్యాయి. తుపాకులతో కాకుండా టారిఫ్‌లతో, వీసాలతో, బెదిరింపులతో వార్ నడిచింది. ఇలా 2025లో ఆయన నిర్ణయాలు ప్రపంచాన్ని ఎలా టార్చర్ పెట్టాయో…
2025లో ప్రపంచం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించింది. ప్రకృతి విపత్తులు ఇక అరుదైన ఘటనలు కావు. అవి షెడ్యూల్ ప్రకారం వస్తున్నాయి. ఒక నెల ఎండతో కాలిపోతే.. మరో నెల నీటిలో మునిగిపోతోంది. ఒక ఖండంలో అగ్ని రాజుకుంటే.. మరో ఖండంలో సముద్రం నగరాల్లోకి దూసుకొస్తోంది. ఇది వాతావరణ మార్పు గురించి హెచ్చరికలు వినే దశ కాదు. ఆ దశ దాటిపోయింది. ప్రపంచం మొత్తం ఒకేసారి ఊపిరి ఆడని దృశ్యాలను చూసింది. భూమి పగిలిపోతుందేమో అనిపించే స్థాయిలో…