ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొదట్లో కాస్త నత్త నడకన నడిచినా..... ఎప్పుడైతే...మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దానికి సంబంధించిన టిప్ ఇచ్చారో... ఆ తర్వాతి నుంచి ఇక దూకుడు పెంచింది సిట్. లిక్కర్ స్కాంలో కర్త.. కర్మ.. క్రియ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన చెప్పటం.. ఇక సిట్ అధికారులు ఆయనతో మొదలు పెట్టి భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వరకూ అరెస్టులు చేయటం…