విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసలు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓ అభినందన పత్రాన్ని పంపించారు. ఈ లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మీడియాకు చూపించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బెల్లాన చంద్రశేఖర్ ప్రతిరోజు ఆసుపత్రులను సందర్శిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారని ఆ లేఖలో…