పార్టీ మారినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇక్కట్లు తప్పడం లేదా? లోకల్ లీడర్లతో పొసగడం లేదా? స్వపక్షంలోని విపక్షీయుల స్వరం పెరుగుతోందా? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథా? వాసుపల్లి వచ్చాక విశాఖ సౌత్ వైసీపీలో గ్రూపులు పెరిగాయా? వాసుపల్లి గణేష్‌కుమార్. వైసీపీ గాలిలోనూ విశాఖలో గెలిచిన నలుగురు టీడీపీలో ఎమ్మెల్యేలలో ఒకరు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టారు వాసుపల్లి. అయితే అప్పటి వరకు వైసీపీని నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లకు ఎమ్మెల్యే ఎంట్రీ…