వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్ టెన్షన్‌గా మారింది. నేడు సీఎం జగన్ జన్మదినం సందర్భంగా రోజా, రోజా వ్యతిరేక వర్గం పోటాపోటీగా జగన్ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిద్దమయ్యారు. నగరిలో రోజా పదివేలమందితో భారీ ర్యాలీ సిద్దం కాగా, రోజా వ్యతిరేక వర్గం పదివేలమందితో ర్యాలీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఎవరి వైపు వెళ్ళాలో అర్థం కాక పార్టీ కేడర్ తలలు పట్టుకుంటున్నారు. నిన్న ఫ్లెక్స్ చింపివేయడంతో రెండు వర్గాల్లో…
ఔను.. వాళ్లంతా ఒక్కటయ్యారు. సొంతపార్టీ ఎమ్మెల్యేపై వేర్వేరుగా కత్తులు దూస్తున్నవారు రూటు మార్చేశారు. వచ్చే ఎన్నికల్లో తమలో ఒకరు ఎమ్మెల్యే అని కొత్తపల్లవి అందుకున్నారట. వైరివర్గం వేస్తున్న ఈ ఎత్తుగడలు ఎమ్మెల్యే రోజాపై కావడంతో వైసీపీవర్గాల్లో ఒక్కటే చర్చ. రాష్ట్రస్థాయి గుర్తింపు ఉన్నా.. నగరి వైసీపీలో రోజాకు ఇంటిపోరు గట్టిగానే ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నగరిలో వైసీపీ లోకల్ లీడర్లతో రోజాకు రోజూ తలపోట్లే..! వైసీపీ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు…