కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూజివీడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నూజివీడు గాంధీ బొమ్మ…