ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓ చర్చలో భాగంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ మేరకు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు…