ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే…
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. మరోవైపు.. అభ్యర్థులు ఎవరు అనేదానిపై కూడా కొంత క్లారిటీ వస్తుంది.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. పనితీరు మెరుగుపర్చుకోకపోతే నో సీటు అని స్పష్టం చేశారు.. ఇక, నెల్లూరు జిల్లా రాజకీయాలు కాకరేపుతుండగా.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల…
వైసీపీలో పాలకొల్లు సీటు ఎవరిది? ఎన్నికలకు ఇంకా చాల టైమ్ ఉన్నా.. అధికారపార్టీలో స్థానికంగా ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకుడు తిరిగి వైసీపీ కండువా కప్పుకోవడంతో సమీకరణాలపై ఆసక్తి రేగుతోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేత పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు టికెట్ తనదే అన్న ధీమాలో కవురు..! కవురు శ్రీనివాస్. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్. పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్. రాష్ట్రంలో వైసీపీ…