తమిళ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ యషిక ఆనంద్ కొద్దిరోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యషిక తన స్నేహితులతో కలసి పాండిచ్చేరిలో పార్టీ ముగించుకుని చెన్నైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలు పావని మృతి చెందింది. యషికాతో పాటు మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా యషిక ఆనంద్ తీవ్ర గాయాలకు గురైంది. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక ఆనంద్…