పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఎర్రబెల్లిని యశస్విని ఓడించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తన గెలుపుపై యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ఎంతటి బిగ్ షాట్ లు అయినా ప్రజలు తిరస్కరిస్తే ఇంటికి వెళ్లాల్సిందేనని తెలిపారు.