Karimnagar: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్‌రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ‘‘కురిక్యాల’’లో చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకుబ్ పాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు.