Hamas New Chief: హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను ముందుండి నడిపించేది ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. రేసులో పలువురు ఉన్నత స్థాయి నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇందులో హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా తెర పైకి వచ్చింది.
Israel Hezbollah: హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నట్లు హెజ్‌బొల్లా గ్రూప్ వెల్లడించింది.
Joe Biden: హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభ సూచకం అన్నారు.
Yahya Sinwar: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిలిటెంట్ గ్రూప్ చీఫ్, 2023 అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మట్టుబెట్టింది. కాగా, చనిపోయే ముందు సిన్వర్ యొక్క చివరి కదలికలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి.
Israel PM Netanyahu: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. అక్టోబరు 7నాటి దాడుల సూత్రధారి.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం హత మార్చినట్లు ప్రకటించింది.
Yahya Sinwar: ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి, దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత, ప్రస్తుతం ఆ సంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఈ వార్త నిజమైతే హమాస్‌ని కూకటివేళ్లతో పెకిలించినట్లే.
Hamas Chief: హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేసేందుకు యాహ్యా సిన్వార్ ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. సిన్వార్ అధికార కాంక్షతో ఉన్నాడని ఖతర్ అధికారులు చెప్పినట్లు పేర్కొనింది.
ఐడీఎఫ్ బలగాలకు సిన్వార్ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందని భావిస్తున్నారు.
Yahya Sinwar: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయిల్ ఉగ్రసంస్థపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా ప్రాంతంలో ఒక్క హమాస్ కార్యకర్త లేకుండా వారిని హతం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడికి ఇప్పటికే హమాస్ దాదాపుగా కకావికలం అయింది. మరోవైపు అగ్రనేతల్ని ఇజ్రాయిల్ వెతికి వేటాడి మట్టుపెడుతోంది.