Icrisat: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిశాట్ రైతుల పాలిట ఓ వరంలా మారింది. భారతదేశంలోనే తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) సైంటిస్టులు జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ ఎక్స్-రే టెక్నాలజీ (EZRT) పరిశోధకుల సహకారంతో ఎక్స్‌రే రేడియోగ్రఫీని ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వేరుశనగల నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగిస్తామని సైంటిస్టులు తెలియజేశారు. దీంతో రైతులు నాణ్యమైన పల్లీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు.…