షియోమి నుంచి 2024లో మొదటి ఎలక్ట్రిక్ వాహనంతో పాటు ఉత్పత్తిని ప్రారంభిస్తుందని వెల్లడించింది. చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్న షియోమి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ ఈ టాపిక్ ను వెల్లడించారు. 2022 నాటికి కంపెనీ తన ఈవీ వెంచర్ లో మూడు బిలియన్ యువాన్లను(434.3 మిలియన్ డాలర్లు ) పెట్టుబడి పెట్టిందని, కంపెనీ తన సమయంలో సగ భాగం షియోమీ ఈవీ కారు వ్యాపారం గురించే ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు.