WTC 2025 Points Table: టెస్టు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఇటీవల పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తాజాగా అడిలైడ్ వేదికగా ముగిసిన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ ఎడిషన్ 2023-25లో ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. 6 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో చేసుకుంది. మొత్తం 61.11 శాతం విజయాలతో…