ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్ టీమ్ సారథిని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించినట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.