టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడటమూ కష్టమేనని ప్రకటించిన 40 ఏళ్ల సాహా.. రంజీ ట్రోఫీ 2024 తనకు చివరిదని చెప్పాడు. తాజాగా సాహా వీడ్కోలు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతేడాదే రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నానని, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు. గతేడాదే క్రికెట్‌ను ఆస్వాదించడం ఆపేశానని చెప్పుకొచ్చాడు. క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో…
Wriddhiman Saha Retirement: టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 0-3తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్ కావడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘోరమైన ఓటమి తర్వాత, అకస్మాత్తుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు.…