WFI Row: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు కావడాన్ని రెజ్లర్లు తట్టుకోలేకపోతున్నారు. ఆయన విజయంపై ఏస్ రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కెరీర్‌కి గుడ్ బై చెప్పింది. రెజ్లర్లు బజరంగ్ పునియా, విజేందర్ సింగ్ వంటి వారు తమ పద్మ శ్రీ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) కొత్త పాలక వర్గాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను, నియమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆదివారం ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించి చేసిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో తెలిపింది.
WFI: మహిళా రెజ్లర్లపై, మైనర్లపై లైంగిక దాడి చేశాడని మాజీ రెజ్లింగ్ ఫెడరేషర్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా పలువురు రెజ్లర్లు పెద్ద ఉద్యమమే చేశారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ తాజా ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బ్రిజ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ విజయం సాధించారు.