మైనర్‌తో సహా పలువురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ, దేశ రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈరోజు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని చెప్పారు.
Wrestlers Protest: గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లకు యోగా గురు రామ్‌దేవ్ కూడా మద్దతు తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను జైలులో పెట్టక తప్పదని అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సిగ్గుచేటని రామ్‌దేవ్ అభివర్ణించారు.
Supreme Court : లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్ల ధర్నా కొనసాగుతోంది.