పారిస్ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్.. సరబ్జోత్ సింగ్ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో మను, సరబ్జోత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
వావ్ మను భాకర్, వావ్ సరబ్జోత్ సింగ్... వీరిద్దరూ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మను భాకర్, సరబ్జోత్ సింగ్.. ఓహ్ యే జిన్, లీ వోన్హోలను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.