రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న సారథి ఆస్పత్రిలో పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి యజమాని పార్థసారధి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో డాక్టర్ సారధి భార్య చంద్రకళ భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన దశ మహా విద్య, ధూమావతి, ప్రత్యంగిర చినమస్త అనేవి తాంత్రిక పూజలు అని ఆమె ఆరోపించారు. అయితే ఈ పూజలపై ఆస్పత్రి యజమాని పార్థసారధిని వివరణ అడగ్గా.. ఇది సాధారణ పూజలేనని..…