Worm in Woman's Brain: వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మెదడులో ఏకంగా 3 అంగుళాల పరాన్నజీవిని వైద్యులు బయటకు తీశారు. మెదడులో పరాన్న జీవి రౌండ్ వార్మ్‌ను చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే ఈ తరహా కేసు మొదటిదని చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ కేసును నివేదించింది.