వరల్డ్ వాటర్‌ఫాల్ రాప్లింగ్ మూడో విడత పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చో్డ మండలంలోని గుండివాగు వద్ద 330 అడుగుల ఎత్తున్న గాయత్రి జలపాతంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలలో 30కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానెల్స్ ఈ పోటీలను టెలికాస్ట్ చేస్తాయని చెప్పారు. ఉవ్వెత్తున దూకే జలపాత ధారల్లో తాడు సాయంతో పై నుంచి (స్ట్రెయిట్ పాయింట్) కిందకు (ఫినిష్ పాయింట్)కు చేరడాన్నే…