వైద్యుడు చెప్పేవరకూ తెలియదు. ఆమాటకొస్తే పరీక్ష చేసేవరకూ వైద్యుడికే తెలియదు. అంత మాయదారి సమస్య హైపర్‌టెన్షన్. నియంత్రణలో ఉంచుకుంటే బానిసలా పడి ఉంటుంది. లక్ష్మణరేఖ దాటగానే.. దశకంఠుడిలా విజృభిస్తుంది. సకల రోగాలకూ స్వాగతద్వారం అవుతుంది. బీపీ విషయంలో జీవనశైలి సర్దుబాటుకు సాటివచ్చే చికిత్సా విధానమే లేదు. అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. సునామీలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రళయమై జీవితాన్ని కబళిస్తుంది. మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నామమాత్రమైన…