ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూరోపియన్ శాఖ ఇవాళ (గురువారం) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కౌమారదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈ-సిగరెట్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది.
Corona : మళ్లీ కరోనా కేసులు రావడం మొదలయ్యాయి. ఈసారి మరో కొత్త వేరియంట్‌తో ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేస్తోంది. గత నెలలో అంటే డిసెంబర్‌లో కరోనా కారణంగా 10,000 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది.
WHO: పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంత దేశాలకు నిఘా పెంచాలని విజ్ఞప్తి చేసింది. కోవిడ్ 19, దాని కొత్త ఉప-వ్యాధి వేరియంట్ JN.1, ఇన్ఫ్లుఎంజాతో సహా శ్వాసకోశ వ్యాధుల కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలు తీసుకోవాలని WHO ప్రజలను కోరింది.
JN.1గా గుర్తించబడిన కొత్త కొవిడ్-19 వేరియంట్ భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అధికారులు, సాధారణ ప్రజలలో భయాందోళనను కలిగిస్తోంది. JN.1 కోవిడ్ సబ్‌వేరియంట్ మొదటగా లక్సెంబర్గ్‌లో గుర్తించబడింది. ఇది పిరోలా వేరియంట్ (BA.2.86) వారసుడిగా పరిగణించబడుతోంది. దీని మూలాలు ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లో ఉన్నాయి.
COVID19: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా మహమ్మారి. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పొయారు. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలా మంది చనిపోయారు. తక్కువ శాతం మంది మాత్రమే కోలుకొని ఇంటికి తిరిగివచ్చారు. అయితే కోలుకున్న వారిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జరిపిన సర్వేలే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ తాజాగా ఓ పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది. కాగా ఇండియన్…
మెక్సికోలో కాస్మెటిక్ సర్జరీలతో సంబంధం ఉన్న ఫంగల్ మెనింజైటిస్ వ్యాప్తిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అమెరికా, మెక్సికోలోని అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకి విజ్ఞప్తి చేసింది.
ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దళాల పోరు తారాస్థాయికి చేరడంతో వందలాది మంది మరణించారు.
ప్రపంచంలో వైరస్‌ల వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. అనేక వైరస్‌లు నేడు ప్రజలపై వాటి ప్రభావాలు చూపుతుండగా.. ప్రస్తుతం మార్బర్గ్ అనే మరో వైరస్ కూడా వచ్చి చేరింది.
టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాల తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 33 వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.