ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు తెలంగాణా లో ఉన్న అవకాశాలను వివరించా అని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్…