దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ 2027ను అక్టోబర్-నవంబర్‌లలో నిర్వహిస్తాయి. 2003 తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే కలిసి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. ఈ టోర్నీలో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ హింట్ ఇచ్చినా.. అందరికి అనుమానాలే ఉన్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు కూడా మెగా టోర్నీలో ఆడడం డౌటే అని తెలుస్తోంది. రోహిత్ శర్మ: 1987లో…
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడనున్నట్లు తెలిపాడు. 2023 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ తన జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.
45 రోజుల పాటు భారత్లో వరల్డ్ కప్ ఫీవర్ నడిచింది. తాజాగా ఆదివారం ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 పూర్తయింది. అయితే ఈసారి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటారని అనుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా చేతిలో చూడాలంటే ఇంకో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. వన్డే క్రికెట్‌లో తదుపరి ప్రపంచకప్ 2027లో జరగనుంది.