Virat Kohli looks to break Sachin Tendulkar’s 50th ODI Century in IND vs NED: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఈరోజు…
IND vs NED Preview and Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో జోరుమీదున్న భారత్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. సెమీస్ స్థానాన్ని ఇప్పటికే ఖాయం చేసుకున్న టీమిండియా.. వరుసగా తొమ్మిదో విజయంపై కన్నేసింది. ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న భారత్.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీపావళి రోజు భారత్ ఎలా వెలుగులు విరజిమ్ముతుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది. 2003 ప్రపంచకప్‌లో…
ఎట్టకేలకు ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది. 338 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన పాక్.. 246 పరుగులకు ఆలౌటైంది.
ప్రపంచకప్ 2023లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని కార్యక్రమంలో మాలిక్ చెప్పాడు.
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం బయటపడింది. ఇంతకుముందు వీరి మధ్య జగడం ఉన్నప్పటికీ మళ్లీ బట్టబయలైంది. వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలపై స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రోమోలో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించిన ప్లేయర్స్ ను చూపించారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఫేవరేట్స్ లో ఒక జట్టుగా బరిలోకి దిగిన పాకిస్తాన్ తగినంత రీతిలో రాణించకపోవడంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్ అనంతరం బాబర్ అజామ్ వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని కొన్ని మీడియా కథనాలలో పేర్కొంది.
Babar Azam React on Pakistan Semi Final Chances: శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ ముందు వరకూ పాకిస్థాన్‌కు ప్రపంచకప్ 2023 సెమీస్ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. లంకపై ఘన విజయంతో నెట్ రన్‌రేట్‌ను పెంచేసుకున్న కివీస్.. నాలుగో జట్టుగా సెమీస్‌లో ఆడటం దాదాపుగా ఖాయమే అయింది. న్యూజిలాండ్ గెలుపుతో పాక్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఇప్పుడు పాక్ ముందంజ వేయాలంటే.. ఇంగ్లండ్‌పై కనివిని ఎరుగని విజయాన్ని అందుకోవాలి. మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగులు, ఛేదనలో…
Babar Azam React on His Captaincy Ahead of ENG vs PAK Match: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ వైఫల్యంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. టీవీలో మాటలు చెప్పడం చాలా సులువని పాక్ మాజీలకు చురకలు అంటించాడు. నాయకత్వ భారం తన బ్యాటింగ్‌పై ఎలాంటి ప్రభావం చేపలేదని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ 2023 పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత తన కెప్టెన్సీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని బాబర్ పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్…