Virat Kohli: వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli looks to break Sachin Tendulkar’s 50th ODI Century in IND vs NED: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఈరోజు నెదర్లాండ్స్ మ్యాచ్ నేపథ్యంలో వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద రికార్డుపై కన్నేశాడు. అదే వన్డేల్లో 50వ సెంచరీ.
వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేరు అనుకున్న దానిని విరాట్ కోహ్లీ సాధ్యం చేసి చూపించాడు. వన్డేల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును వన్డే ప్రపంచకప్ 2023లో కోహ్లీ సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 120 బంతుల్లో 100 మార్క్ అందుకున్నాడు. దాంతో కోహ్లీ ఖాతాలో 49వ సెంచరీ చేరింది. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 శతకాలు బాదగా.. విరాట్ 277 ఇన్నింగ్స్‌ల్లోనే 49 సెంచరీలు చేశాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మరో సెంచరీ బాదితే.. 50 వన్డే శతకాలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడానికి కోహ్లీ ఉవ్విల్లూరుతున్నాడు. ఇందుకు నెదర్లాండ్స్ మ్యాచ్ మంచి అవకాశం అని చెప్పాలి. ఇప్పటికే పటిష్ట జట్లపై చెలరేగిన కింగ్ కోహ్లీ.. పసికూన నెదర్లాండ్స్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడడం అతడికి పెద్ద కష్టమేమి కాదు. ఇలాంటి ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదు కూడా. సెమీస్ మ్యాచ్ ఉన్నా.. నెదర్లాండ్స్‌పైనే శతకం చేసి విరాట్ చరిత్ర సృష్టించాలని కోహ్లీ ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. ‘సలార్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 463 వన్డేలు ఆడి.. 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలతో 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 289 వన్డేలు ఆడి 49 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలతో 13,626 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్‌లలోసచిన్ 100 సెంచరీలు (టెస్టుల్లో 51, వన్డేల్లో 49) చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 79 శతకాలు (టెస్టులో 30, వన్డేల్లో 49, టీ20ల్లో 1) బాదాడు. నేడు నెదర్లాండ్స్‌పై శతకం బాదితే.. ఆ సంఖ్య 80కి చేరుకుంటుంది.
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!