Neeraj Chopra Diamond League Final: బ్రసెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో అత్యుత్తమ త్రో చేశాడు. అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో ఉండగా, పారిస్ ఒలింపిక్స్ 2024 రజత పతక విజేత నీరజ్ కేవలం 0.01 మీటర్ల తేడాతో టాప్ ప్రైజ్‌ను కోల్పోయాడు. నీరజ్ కేవలం 1 సెంటీమీటర్ తేడాతో…
కెరీర్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత్ స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. శనివారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ 50 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 7-0 తేడాతో మీనాక్షి (హరియాణా)పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పసిడి నెగ్గి దూకుడు మీదున్న ఈ తెలంగాణ బాక్సర్.. కొత్తగా 50 కేజీల విభాగంలోనూ అదరగొట్టింది. బౌట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. ”…