ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండో పసిడి సాధించాలనే భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఆశలు ఆవిరయ్యాయి. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల కోసం భారత బాక్సింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ఎంసీ మేరీకోమ్ పోటీపడింది. శుక్రవారం జరిగిన ట్రయల్స్ తొలి రౌండ్‌లో కాలు గాయానికి గురైన మేరీకోమ్.. బౌట్ మధ్యలోనే నిష్క్రమించింది. 2018 కామన్‌వెల్త్ క్రీడల పసిడి విజేత, 39 ఏండ్ల…